ఘోర అగ్నిప్రమాదం: పాక్ లో 140 మంది సజీవదహనం

pak-fireపాకిస్థాన్‌లో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో148 మంది సజీవదహనమయ్యారు. కరాచీ నుంచి లాహోర్‌కి 25,000 లీటర్ల ఆయిల్‌ను తరలిస్తున్న ఓ ట్యాంకర్‌ బహవల్‌పూర్‌ ప్రాంతం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ట్యాంకర్‌ బోల్తా పడడంతో రహదారిపై భారీగా ఆయిల్ లీకైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా బకెట్లతో ఆయిల్ తోడుకోవడానికి పెద్ద ఎత్తున వచ్చారు. ఇంతలో ట్యాంకర్‌ పేలిపోవడంతో అక్కడున్నవారంతా దుర్మరణం చెందారు. ఈ సంఖ్య 148 అని చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపుచేశారు. గాయపడ్డవారిని హెలికాప్టర్లలో స్థానిక హాస్పిటల్ లో జాయిన్ చేశారు. స్థానికులు ఆయిల్‌ తోడుకుంటుండగా.. ఓ వ్యక్తి సిగరెట్‌ వెలిగించడంతో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. చుట్టు పక్కల నిలిపివున్న కార్లు, ద్విచక్రవాహనాలు కూడా దగ్ధమయ్యాయి. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ముద్దలా మారిపోవడంతో వారిని గుర్తించలేకపోతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy