ఘోర ప్రమాదం:అదుపు తప్పిన లారీ.. 20 మంది మృతి

accidentచిత్తూరు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. పూతలపట్టు నాయుడుపేట రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పింది. లారీ బ్రేక్ ఫేయిల్ అవ్వడంతో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని.. పక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20మందికి పైగా గాయపడ్డారు. వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గాయపడ్డవారిని చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy