ఘోర రోడ్డు ప్రమాదం: 10మంది మృతి

TAMILANADU ACCIతమిళనాడులో బుధవారం(డిసెంబర్-6) అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తిరుచ్చి జిల్లా తువరన్‌కురిచ్చి దగ్గర జాతీయ రహదారిపై బోర్‌వెల్‌ వాహనాన్ని.. వ్యాన్‌ ఢీకొట్టడంతో 10 మంది మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాగర్‌కోయిల్‌ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బోర్‌వెల్‌ వాహనాన్ని డ్రైవర్‌ ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో వెనుక వస్తున్న వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. తిరుచ్చి ఎస్పీ పీఎస్సీ కల్యాణ్‌ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షించారు. ఈ  ప్రమాదంలో వ్యాన్‌ నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కన్యాకుమారికి చెందిన ఒకే కుటుంబం వారిగా గుర్తించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy