చండీయాగం ఏర్పాట్లలో సీఎం కేసీఆర్

kcr at yagamఅయుత చండీయాగానికి అంతా రెడీ అవుతోంది. యాగశాల ప్రాంతాన్ని పరిశీలించిన KCR.. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చే రెండు వేల మంది రుత్వికులు యాగం నిర్వహించనున్నారు. ఈ మహాత్కార్యానికి రాష్ట్రపతితో పాటు చాలామంది ప్రముఖులు వస్తున్నందున ఏర్పాట్లు బాగా చేయాలని సూచించారు సీఎం కేసీఆర్.

40 ఎకరాలు..101 హోమ గుండాలు..4 యాగశాలలు..మహిళల కుంకుమార్చనకు ప్రత్యేక ప్రాంగణం. చతుర్వేద యాగశాలలు. రాజశ్యామల, మహారుద్ర, అయుత మహాచండీ యాగాలకు వేర్వేరుగా.. యాగశాలలు ఏర్పాటు. వీవీఐపీల కోసం ఐదు హెలిప్యాడ్లు..సీసీ కెమెరాలతో నిరంతర నిఘా. అయుత చండీ మహాయానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించే యాగం ఏర్పాట్లను పరిశీలించారు సీఎం కేసీఆర్. ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

రాష్ట్రం నుంచే కాకుందే దేశం నలుమూలల నుంచి వచ్చే రెండు వేల మంది రుత్వికులు యాగశాలలోనే ఉండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు…మధ్యాహ్నం 3.45 నుంచి రాత్రి ఏడు గంటల వరకు యాగం నిర్వహిస్తారు. శృంగేరీ పీఠం నుంచి వచ్చిన ఆరుగురు ప్రధాన రుత్వికులు చండీ యాగాన్ని పర్యవేక్షించనున్నారు. భక్తులు యాగాన్ని చూసేందుకు.. యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీల కోసం మూడు, వీఐపీలకు మూడు ప్రత్యేక కాటేజీలు నిర్మించారు. రుత్వికులు బస చేసేందుకు, భోజనానికి రెండు వసతి సముదాయాలు ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా హాల్స్  నిర్మించారు.

యాగం దగ్గర ప్రత్యేకంగా మీడియా పాయింట్  ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు విశ్రాంతి తీసుకునేందుకు, ఎప్పటికప్పుడు వార్తలు పంపేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, అధికారులు, నేతలు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక భోజనశాల నిర్మించారు. వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేక సీటింగ్  అరేంజ్ మెంట్  చేశారు. ప్రతిరోజు దాదాపు 50 వేల మందికి భోజనం పెట్టేందుకు భోజనశాల నిర్మించారు. యాగశాల ప్రాంగణంలోనే ఐదు ప్రత్యేక హెలిప్యాడ్లు నిర్మించారు. దాదాపు 15 వేల వాహనాల కోసం పార్కింగ్  ఏర్పాట్లు చేశారు. యాగం చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. మంచినీటి వసతి, సానిటేషన్  కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా వాటర్  ప్రూఫ్  రూఫింగ్  చేశారు.

ఆయుత మహా చండీ యాగానికి.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరు కానున్నారు. వారందరికీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

…………………………………………………………….

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy