చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టారు : బీజేపీ నేత రాంమాధవ్

rammadhavకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్. కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేశారని ఆయన ట్వీట్ చేశారు. ఆనాటి హైదరాబాద్ పరిధిలోని కర్ణాటక, కోస్టల్ కర్నాటకలో 40 స్థానాల్లో.. బీజేపీ 20 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉందన్నారు. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కేవలం 6 స్థానాలకే బీజేపీ పరిమితం అయ్యిందని గత ఎన్నికల ఫలితాలను గుర్తు చేశారు.

ఈసారి 14 సీట్లు అదనంగా గెలుచుకుని.. 20 స్థానాల్లో గెలుపు దిశగా వెళుతున్నాం అన్నారు. తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో బీజేపీని ఓడించటానికి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చినా కూడా.. కర్ణాటకలో బీజేపీ గెలిచిందన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు రాంమాధవ్. కర్నాటక విజయం.. దక్షిణాదిలో తమ విజయానికి బాటలు పడ్డాయని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy