చక్ దే.. ఫలక్‌నుమా

DSC_05471బెస్ట్ ప్యాలెస్ హోటల్ గా ప్రపంచ స్థాయి గుర్తింపు

నిజాం పాలకుల రాజసానికి, అప్పటి నిర్మాణ వైభవానికి చిహ్నంగా నిలిచిన ఫలక్‌నుమా ప్యాలెస్‌కు అరుదైన గుర్తింపు లభించింది. 2015 సంవత్సరానికి ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ ప్యాలెస్ హోటల్‌గా ఎంపికైంది. ఈ ప్యాలెస్ నిర్వహణను కొన్ని సంవత్సరాల క్రితం తాజ్ గ్రూపు చేపట్టింది. 60 గదుల ఈ ప్యాలెస్‌ను పర్యాటకుల అవసరాలకు తగినట్టుగా నిర్వహిస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత టూరిజం… ట్రావెల్ వెబ్‌సైట్ ట్రిప్ అడ్వయిజర్ ప్రపంచ పర్యాటకుల అభిప్రాయాలు… సమీక్షల ఆధారంగా తాజ్ ఫలక్‌నుమాను బెస్ట్ ప్యాలెస్ హోటల్‌గా గుర్తించింది. ప్యాలెస్ హోటళ్ల కేటగిరీలో ఈ అవార్డు దక్కింది.

14cs19అడుగడుగునా రాచఠీవిని నింపుకున్న భవన నిర్మాణం, రాజసానికి అద్దం పట్టే ఫర్నిచర్, మార్బుల్ మెట్లు, భారీ షాండ్లియర్లు, కనువిందు చేసే కుడ్యచిత్రాలు, విశిష్ట పురాతన వస్తువులు, విలాసవంతమైన గదులతో ఈ హోటల్ ప్రపంచ పర్యాటకుల మనసులను గెలిచిందని ట్రిప్ అడ్వయిజర్ తెలిపింది. ప్రపంచంలోని 37 లక్షల రెస్టారెంట్లు, హోటళ్లు, దర్శనీయ స్థలాలు, వసతి సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే ఈ వెబ్‌సైట్‌ను నెలవారీగా 26 కోట్ల మంది చూస్తారు.

 

images (1)17181315

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy