చదవమన్నందుకు.. నాలుగో తరగతి విద్యార్థి సూసైడ్

student-suicideపదేళ్ల పిల్లాడి ఆత్మహత్య ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో సంచలనమైంది. ఆడతావెందుకు… చదువుకోవచ్చు కదా అన్నందుకు … ఆత్మహత్యకు పాల్పడ్డాడు బాలుడు. పోలీసుల కథనం ప్రకారం… భోపాల్ కు 43 కిలోమీటర్ల దూరంలోని బెరాసియా… గ్రామంలో నివసిస్తోంది ఈ పిల్లాడి కుటుంబం. వీరిది జాయింట్ ఫ్యామిలీ.  నాలుగో తరగతి చదువుతున్న ఆ అబ్బాయి… స్కూల్ కు వెళ్లే ముందు ఆటలాడుతూ కనిపించాడు. అయితే అటుగా వెళ్తున్న బాలుడి తల్లి ఈ విషయం గమనించి మందలించింది. దీంతో అలిగిన ఆ విద్యార్థి… ఆవేశంగా గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. అరగంట తర్వాత గదిలోకి వచ్చిన ఆ పిల్లాడి బంధువు… ఈ విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలిపింది. పిల్లాడి ఆత్మహత్యతో కుటుంబంలో విషాదం అలుముకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy