చరణ్-బన్నీల లైవ్ స్కిట్?

imagesమెగా హీరోలు రాం చరణ్, అల్లు అర్జున్ మరోసారి కలిసి యాక్ట్ చేయబోతున్నారు. అది కూడా యంగ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో. అవును, మారుతి చెప్పిన కాన్సెప్ట్ ను ఈ మెగా హీరోలు ఓకే చేశారు. అయితే ఇది సినిమా కోసం కాదు…తుఫాను బాధితుల కోసం. హుదూద్ తుఫాన్ బాధితుల సహాయం కోసం టాలీవుడ్ ఈ నెల 30 న ‘మేము సైతం’ పేరుతో భారీ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రోగ్రాంలో లైవ్ పెర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయనున్నారు. అందులో భాగంగా మారుతి చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో స్కిట్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఎవడు’ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు యాక్ట్ చేశారు. అయితే ‘ఎవడు’లో ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సీన్స్ లేవు. దీంతో ఫస్ట్ టైం చరణ్-బన్నీలు కలిసి ఇచ్చే లైవ్ పెర్ఫామెన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. వీరే కాక త్రివిక్రమ్ కాన్సెప్ట్ తో మహేష్-పవన్, బోయపాటి శ్రీను కాన్సెప్ట్ తో జూ.ఎన్టీఆర్-బాలకృష్ణ స్కిట్ చేయనున్నట్టు టాక్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy