చరిత్రలో నిలిచిపోనుంది : జూలై 27న సంపూర్ణ చంద్రగ్రహణం

Blood-moon-977789ఈ సంవత్సరం జనవరి 31న ఆకాశంలో సూపర్ బ్లడ్ మూన్ కనువిందు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అరుదైన బ్లడ్ మూన్ కనిపించనుంది. ఈ వంద సంవత్సరాల్లో అత్యంత సంపూర్ణ చంద్రగ్రహణంగా చరిత్రలో నిలిచిపోనుంది.  జూలై 27న అరుదైన బ్లడ్‌ మూన్‌ వీక్షకులకు కనువిందు చేయనుంది. ఒకే ఏడాదిలో రెండు బ్లడ్ మూన్  ఏర్పడనుండటం విశేషంగా చెబుతున్నారు.

భూ వాతావరణం ప్రభావంతో వక్రీభవనం చెందిన సూర్యకాంతి ప్రకాశింపజేయడంతో.. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలో ప్రకాశిస్తాడు. ఈ ఖగోళ పరిణామాన్ని  అరుణవర్ణ చందమామగా పిలుస్తారు. జూలై  27న ఏర్పడనున్న  బ్లడ్ మూన్ 103 నిమిషాలు కొనసాగడం ద్వారా ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణంగా నిలుస్తుందని తెలిపారు ఖగోళ నిపుణులు.  ఈ సమయంలో భూమి నుంచి చందమామ గరిష్ఠ దూరంలో ఉంటుందని.. దీంతో భూమి నీడను దాటడానికి దానికి ఎక్కువ సమయం అవసరమవుతుందని వివరించారు.

అందుకే రానున్న బ్లడ్ మూన్ .. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణంగా రికార్డులకెక్కుతుందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 31న ఏర్పడిన సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌ 63 నిమిషాలు మాత్రమే కొనసాగిందని గుర్తుచేశారు. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో తాజా బ్లడ్ మూన్  కనిపిస్తుందని.. ఉత్తర అమెరికా, ఆర్కిటిక్‌-పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రజలు దీన్ని వీక్షించలేరని తెలిపారు సైటింస్టులు.

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy