తక్కవ మెజారిటీతో గట్టెక్కిన ఎర్రబెల్లి…

Entrance-Arch-to-Palakurthi-Hill-top-Temple

వీరనారి చాకలి ఐలమ్మ, మహాకవులు బమ్మెర పోతన, పాలకుర్తి సోమనాధుడు పుట్టిన గడ్డ. తెలంగాణలో ఘనమైన చరిత్ర ఈ సెగ్మెంట్ సొంతం. కానీ అభివృద్దికి మాత్రం ఆమడదూరంలో ఉండిపోయింది. దశాబ్దాలుగా నియోజకవర్గం ఒకే కులం చేతుల్లో ఉంది. వెనకబాటుకు అది కూడా ఓ కారణం అంటారు స్థానికులు. అదే వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం.
………………….

 • పాలకుర్తి నియోజక వర్గం 2004 వరకు చెన్నూరు నియోజకవర్గంలో ఉండేది.
 • చెన్నూరు సెగ్మెంట్ లో పాలకుర్తి, కొడకండ్ల, తోర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు మండలాలుండేవి.
 • 2009 డీలిమిటేషన్ లో చెన్నూరు నుంచి విడిపోయి.. పాలకుర్తి సెగ్మెంట్ గా ఏర్పడింది.
 • తొర్రూర్, కొడకండ్ల, పాలకుర్తి మండలాలతోపాటు వర్థన్నపేట నియోజకవర్గంలోని రాయపర్తి, జనగామలోని దేవరుప్పల మండలాలు ఇందులో కలిసిపోయాయి.
 • పాలకుర్తిలో ఉన్న నర్సింహులపేటను డోర్నకల్ లో… నెల్లికుదురును మహబూబాబాద్ లో కలిపారు.
 • పాలకుర్తి నియోజక వర్గంలో ఐదు మండలాలున్నాయి.
 • మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 775.
 • పురుష ఓటర్లు లక్షా ఒక వేయి 217.
 • మహిళా ఓటర్లు 99 వేల 558.
 • అత్యధికంగా బీసీలున్న ఈ నియోజక వర్గంలో అగ్రకులాలదే పైచేయి.
 • అగ్రకులాల ఆధిపత్యంతోనే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదగలేకపోయింది.
 • బీసీ, దళితుల్లో రాజకీయ చైతన్యం రాకుండా  అగ్రకులాలు అడ్డుపడ్డాయన్న అపవాదుంది.
 • ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి చేతిలోనే చెన్నూరు సెగ్మెంట్ దశాభ్దాలుగా ఉండటం దీనికి ఉదాహరణ.
  …………………..
 • రద్దయిన చెన్నూరు నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగాయి.
 • కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) కలిసి నాలుగు సార్లు, టీడీపీ నాలుగుసార్లు, టీఆర్ఎస్, సోషలిస్టు పార్టీ, పీడీఎఫ్, ఇండిపెండెంటు అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు.
 • 1957 పీడీఎప్ కు చెందిన ఎస్. వెంకట కృష్ణ ప్రసాద్ గెలుపొందారు.
 • 1962లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి ఎన్ యతిరాజారావు గెలిచారు.
 • 1967లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎన్. విమలాదేవి విజయం సాధించారు.
 • 1972లో ఇండిపెండెంట్ అభ్యర్ధి కె.మధుసుధన్ రెడ్డి గెలిచారు.
 • 1975 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యతిరాజారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 • 1978, 1983 రెండు దఫాలుగా యతిరాజారావు కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) నుండి గెలిచారు.
 • 1985, 1989, 1994లో మూడు దఫాలుగా టీడీపీ తరుఫున యతిరాజారావు గెలుపొందారు.
 • మొత్తంగా యతిజారావు ఏడుసార్లు గెలిచారు.
 • 1999లో టీడీపీ తరఫున ఎన్.సుధాకర్ రావు గెలుపొందారు.
 • 2004లో టీఆర్ఎస్ నుండి దుగ్యాల శ్రీనివాసరావు విజయం సాధించారు.
 • తర్వాత 2009లో చెన్నూరు సెగ్మెంట్ పాలకుర్తిగా మారింది.
 • అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ నుండి గెలుపొందారు.

……………………..

 • 2009లో డీలిమిటేషన్ జరగడంతో కొత్తగా ఏర్పడిన పాలకుర్తి నుంచి టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి దుగ్యాల శ్రీనివాసరావుపై గెలుపొందారు.
 • దుగ్యాల శ్రీనివాసరావు 2004లో చెన్నూరు నుండి టీఆర్ఎస్ తరుఫున పోటీచేసి గెలుపొందారు.
 • తర్వాత అసమ్మతి ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హతకు గురైన తొమ్మిది మందిలో ఒకరి ఉన్నారు.
 • తీర్పు రావడానికి ఓ రోజు ముందే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
 • చెన్నూరు నియోజకవర్గం రద్దు కావడంతో దుగ్యాల శ్రీనివాసరావు పాలకుర్తి బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.
 • అంతకుముందు ఎర్రబెల్లి దయాకరరావు 1994 నుంచి వర్థన్నపేటలో మూడుసార్లు గెలుపొందారు.
 • ఆ నియోజకవర్గం 2009లో ఎస్సీకి రిజర్వుడ్ కావడంతో ఎర్రబెల్లి పాలకుర్తిలో పోటీ చేసి గెలుపొందారు.

……………………..

 • పాలకుర్తిలో ప్రజా ప్రతినిధులు మారినా ప్రజల అవసరాలు మాత్రం తీర్చలేకపోయారు.
 • సెగ్మెంట్ కు ఘన చరిత్ర ఉన్నా… ఇక్కడి నుంచి గెలిచిన నేతలు ప్రభుత్వాల్లో కీలక పదవులు అనుభవించినా… అభివృద్ధి అంగుళం కూడా కదల్లేదు.
 • ఇప్పటికీ కొన్నిగ్రామాల్లో సాగు, తాగునీటి సమస్యతో జనం అల్లాడిపోతున్నారు.
 • 2009లో ఎన్నికైన ఎర్రబెల్లి దయాకర్ రావు ఏనాడు సెగ్మెంట్ వైపు చూసిన దాఖలాలు లేవని మండిపడుతున్నారు స్థానికులు.
 • కానీ ఈసారి కూడా ఆయననే గెలిపించారు.
 • అయితే అతి తక్కువ మెజారిటీతో గెలిచిన నాయకుల్లో ఎర్రబెల్లి ఒకరు.
 • కేవలం 4313 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దుగ్యాల శ్రీనివాసరావుపై గెలిచారు ఎర్రబెల్లి దయాకర్ రావు

……………………..

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy