చరిత్ర సృష్టించిన టీమిండియా : శ్రీలంకను మట్టికరిపించిన కుర్రోళ్లు

india-silankaశ్రీలంకతో మూడో టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇన్నింగ్స్ ఘన విజయం సాధించింది. 171 పరుగులతో తేడాతో లంకను చిత్తు చేసి.. చారిత్రక విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. మూడో టెస్ట్ మూడో రోజు ఫాలో ఆన్ ఆడుతున్న లంక 19 పరుగుల దగ్గర.. 333 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగింది. చేతిలో తొమ్మిది వికెట్లు. డిఫెన్స్ ఆటతో మ్యాచ్ నిలబెట్టుకోవాలని చూసిన లంకను.. టీమిండియా బౌలర్లు చిత్తు చేశారు. పుష్పకుమారను ఒక్క రన్ తోనే పెవిలియన్ పట్టించి.. వికెట్ల వేట మొదలుపెట్టారు. ఆ తర్వాత ఓపెనర్ కరుణరత్నే కూడా 16 పరుగుల దగ్గర ఔట్ అయ్యి భారత్ కు విక్టరీ అవకాశాలను మెరుగుపర్చాడు.

ఆ తర్వాత వచ్చిన దినేష్ చండిమాల్ 36, మ్యాథ్యూస్ 35 పరుగులతో కొద్దిసేపు ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఈ జోడీని అశ్విన్ బ్రేక్ చేశాడు. 52 బంతుల్లో 41 పరుగులతో నిరోషన్ కొద్దిసేపు మెరుపులు మెరిపించినా ఫలితం లేదు. వెంట వెంటనే పడుతున్న వికెట్లతో 181 రన్స్ కు చాపచుట్టేసింది శ్రీలంక. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది టీమిండియా. 171 పరుగుల ఇన్నింగ్స్ విజయంతో శ్రీలంక గడ్డపై విజయ విహారం చేశారు కుర్రోళ్లు.

85 ఏళ్ల చరిత్ర :

టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతం. విదేశీ గడ్డపై టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయటం కోహ్లీ ఘనతే. ఏ కెప్టెన్ కు సాధ్యం కాలేదు ఇప్పటి వరకు. అంతటి అరుదైన రికార్డ్ ను భారత్ కు తెచ్చిపెట్టాడు కోహ్లీ. విదేశీ గడ్డపై టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం 85 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇదే మొదటిసారి.

రాణించిన బౌలర్లు :

సెకండ్ ఇన్నింగ్స్ లో అశ్విన్ నాలుగు వికెట్లు, షమి మూడు వికెట్లు, ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కుల్దీప్ యాదవ్ లంక బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ దారి పట్టిస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ పని అశ్విన్, షమి చేశారు. అశ్విన్ 4, షమి 3, ఉమేష్ యాదవ్ 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. లంక బ్యాట్స్ మెన్ లో డిక్వెల్లా చేసిన 41 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు.

స్కోర్ బోర్డ్ :

టీమిండియా ఫస్ట్ ఇన్సింగ్ : 487 ఆలౌట్

శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్ : 135 ఆలౌట్

శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ : 181 ఆలౌట్

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy