మళ్ళీ చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. రేవంత్ కుమార్తె నిశ్చితార్ధానికి ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన 12 గంటల బెయిలిచ్చింది. ఇవాళ ఉదయం 6 గంటలకు జైలు నుంచి ఇంటికి వచ్చిన రేవంత్.. అక్కడి నుంచి కుటుంబ సమేతంగా ఎన్.కన్వెన్షన్ సెంటర్ బయలుదేరారు. ఎంగేజ్ మెంట్ సెర్మనీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ గడువు ఉన్నప్పటికీ.. సిటీలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని.. సాయంత్రం 4 గంటలకే రేవంత్ ను ఇంటి నుంచి చర్లపల్లి జైలుకు తీసుకువెళ్లారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy