చలపతిరావు కౌంటర్ : డబుల్ మీనింగ్ తీయొద్దు

Chalapathi-Raoఅమ్మాయిలపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చలపతిరావుకు చుక్కెదురైంది.  రారండోయ్‌ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా చలపతిరావు చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం రేగింది.   సోషల్‌ మీడియాలో ఆయనపై మేధావులు, రచయిత్రులు, మహిళా నాయకులు మండిపడుతున్నారు. ఈ మేరకు నటుడు చలపతిపై హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌ పోలీస్‌ స్టేషన్ లో కంప్లయింట్ చేశాయి మహిళా సంఘాలు.

విషయం పెద్దది అవ్వటంతో  చలపతిరావు స్పందించారు. తను మాటలకు మహిళలు బాధ పడ్డారని మీడియాలో వార్తలు వచ్చాయని.. ప్రతీమాటను డబుల్ మీనింగ్ లో తీసుకోవద్దన్నారు. మహిళలపై నిజాయితీగా మాట్లాడానని.. ఆడది హానికరమా అనే మాటను ఏ ఒక్క నారీమణి, ఒక్క మగాడు ఖండించలేదన్నారు. ప్రపంచంలో ఏ మగాడికైనా ఆడది ఉంటుందన్నారు. నేను ఆర్టిస్టుగా ఎదగడానికి నా భార్యే కారణమని తెలిపారు.

నా భార్య చనిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోకుండా పిల్లలను నేనే పెంచుకున్నానని తెలిపారు. నేను ఆడవాళ్లను గౌరవిస్తాను.. ఎంతో మంది సపోర్టింగ్ ఆర్టిస్టులతో నటించానని.. ఎప్పుడు ఎవరితో అసభ్యంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్క మాటలోను డబుల్ మీనింగ్ అర్ధాలు వెతుకుతున్నారు.. నా మాటలకు మీరు బాధ పడి ఉంటే.. వాళ్లందరికీ నేను క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఆడది హానికరం కాదు.. పక్కలో పడుకుంటుందని అంటే ఎందుకు తప్పుపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. జై మహిళా లోకం అని ముగించారు చలపతిరావు.

డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో వచ్చే ప్రోగ్రామ్స్, టీవీ కార్యక్రమాలపై మహిళా సంఘాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నేను చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పానని.. అయినా వినకపోతే నేనేం చేస్తాను అన్నారు. నేను చేసిన కామెంట్ పై మహిళా సంఘాలు అంత విరుచుకుపడుతున్నాయి కదా… నేను అన్న కామెంట్స్ కంటే ఘోరాతిఘోరంగా కొన్ని ప్రోగ్రామ్స్ లో మహిళలను కించపరుస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తున్నాయని.. వాటి విషయలో పోరాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు నటుడు చలపతిరావు.

Chalapathi Rao 发布于 2017年5月22日周一

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy