
భారతదేశ వారసత్వ, సాంస్కృతిక సంపద ఉట్టిపడేలా కొత్త 200 నోటు వెనుకభాగంలో సాంచీ స్థూపాన్ని ఫ్రింట్ చేశారు. నోటు ముందు భాగం కుడివైపు చివరన అశోక స్థూపాన్ని ముద్రించారు. మహత్మా గాంధీ కొత్త సిరీస్ తో ఈ నోటు వచ్చింది. దేవనాగరి లిపిలో 200 అంకెను నోటు ముందు, వెనుక భాగంలో ముద్రించారు. కొత్త 200 నోటు పసుపు కలర్ లో ఉంది. ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంది. మైసూర్ గవర్నమెంట్ ప్రెస్ లో కొత్త 200 నోట్లను ముద్రించారు.
కొత్త 50 నోటు వెనక భాగంలో హంపి రథం బొమ్మ ఉంది. సాంస్కృతి వారసత్వానికి నిదర్శనంగా హంపి బొమ్మను ముద్రించారు. ఫ్లోరోసెంట్ నీలి రంగులో నోటు ఉంది. కలర్ స్కీమ్‌తో పాటు ఇతర డిజైన్, జియోమెట్రిక్ ప్యాటర్స్న్ ఉన్నాయని RBI తెలిపింది. ప్రస్తుతం ఉన్న పాత రూ.50 నోటు కూడా చెలామణిలో ఉంటుందని స్పష్టం చేసింది.