చలోరే చలోరే చల్‌ : పవన్‌ ప్రజాయాత్ర షెడ్యూల్‌

janasenaజనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిరంతర ప్రజాయాత్ర (చలోరే చలోరే చల్‌)ను సోమవారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని జనసేన పరిపాలన కార్యాలయం నుంచి ఆయన తన యాత్రను ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లో బయల్దేరి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేరుకుంటారు. అక్కడ ఆలయంలో ఆంజనేయస్వామికి పూజలు చేస్తారు. అనంతరం తన యాత్ర ప్రణాళికను వెల్లడిస్తారు. సాయంత్రం కరీంనగర్‌ చేరుకుని జనసేనకు చెందిన స్థానిక ముఖ్య ప్రతినిధులతో మాట్లాడతారు.

ఈ నెల 23న కరీంనగర్‌లోని జగిత్యాల రోడ్‌లో ఉన్న శుభం గార్డెన్స్‌లో ఉదయం 10.45 గంటలకు ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్న భోజనం అనంతరం కొత్తగూడెం బయల్దేరి వెళతారు. రాత్రికి కొత్తగూడెంలో బస చేస్తారు. 24న ఉదయం 9.30 గంటలకు కొత్తగూడెం నుంచి ప్రదర్శనగా బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 3 గంటలకు ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో జరిగే ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy