చలో అసెంబ్లీ సక్సెస్ చేస్తాం

assembly_0-620x330వరంగల్  జిల్లా మేడారంలో జరిగిన ఎన్ కౌంటర్  కు నిరసనగా బుధవారం తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. వరంగల్ లో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని… పౌరహక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి నిరంతరం ఉద్యమిస్తామని ప్రకటించింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వివిధ పార్టీలు, 370 ప్రజాసంఘాలు కూడా మద్దతు ప్రకచించాయి. ఛలో అసెంబ్లీకి మద్దతుగా ఓయూ నుంచి అసెంబ్లీ వరకు విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించనున్నాయి.

వామపక్షాలు తలపెట్టిన ఛలో అసెంబ్లీకి ఎలాంటి అనుమతి లేదన్నారు పోలీసులు. అసెంబ్లీ పరిధిలో రెండు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచారు. జిల్లాల నుంచి కార్యకర్తలు, జనాలు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున నగర శివార్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో వామపక్ష పార్టీల సీనియర్ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఛలో అసెంబ్లీలో ఎవరు పాల్గొనాలని వచ్చినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎన్ని ఆటంకాలు కల్పించినా.. ఛలో అసెంబ్లీ విజయవంతం చేసి తీరుతామంటున్నారు ప్రజాస్వామిక వేదిక నాయకులు. జిల్లాల్లో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy