చలో అసెంబ్లీ – హైటెన్షన్

వామపక్షాల చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా ప్రజా సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. చలో అసెంబ్లీతో ప్రభుత్వానికి నిరసనకు నిర్ణయించాయి. రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించటంతో.. పోలీసులు కూడా హై అలర్ట్ అయ్యారు. కార్యకర్తలు హైదరాబాద్ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుతున్నారు. ఇక ప్రజా, ఉద్యమ నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. బస్, రైల్వే స్టేషన్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో వస్తున్న వారిని హైదరాబాద్ చేరకుండానే అడ్డుకుని అరెస్ట్ లు చేశారు.

బాగ్ లింగంపల్లిలో ఉద్రిక్తం

1హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందయ్యవిజ్ణాన కేంద్రం దగ్గర భారీగా బలగాలు మోహరించాయి. చలో అసెంబ్లీ నిర్వహించి తీరతామని పంతంతో విజ్ణాన కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో పౌర, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు బయటకు వచ్చారు. ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. వరవరరావు, హరగోపాల్, చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ఓయూ గేట్లు మూసివేత

4ఉస్మానియా వర్సిటీ. తెలంగాణ ఉద్యమం అంటే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. 15 నెలల తర్వాత మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు వర్సిటీలో నెలకొన్నాయి. ఓయూ చుట్టూ ఉన్న అన్ని గేట్లు మూసివేశారు. చలో అసెంబ్లీకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ ర్యాలీలు నిర్వహించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరూ బయటకు వెళ్లకుండా నిఘా పెట్టారు. కొందరు స్టూడెంట్స్ లీడర్స్ ను అదుపులోకి తీసుకున్నారు.

గన్ పార్క్ – ఆత్మహత్యాయత్నం

Sequence 1అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో గన్ పార్క్ దగ్గర భద్రతను పెంచారు. కేంద్ర బలగాలు మోహరించాయి. అయితే కొందరు ఆందోళనకారులు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వైపు దూసుకొచ్చారు. ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించారు. అలర్ట్ అయిన బలగాలు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని.. గన్ పార్క్ నుంచి తరలించారు.

ఇందిరాపార్క్

2ఇందిరాపార్క్ దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళా ఆందోళనకారులపై పోలీసులు ప్రతాపం చూపారు. బలవంతంగా అరెస్ట్ చేసి.. స్టేషన్లకు తరలించారు. మావోయిస్ట్ ఏజెండానే మా ఎజెండా అని చాలా సందర్భాలు, ఉద్యమ సమయంలో చెప్పిన టీఆర్ఎస్ పార్టీ.. వరంగల్ ఎన్ కౌంటర్ కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా, పౌర సంఘాలపై నిర్బంధం కొనసాగుతుందని.. అరెస్ట్ చేసిన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy