చల్లని, కమ్మని కబురు : అండమాన్ దాటిన నైరుతి రుతుపవనాలు

mansoonచాలా చాలా మంచి వార్త ఇది. చల్లని కబురు ఇది. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబర్ దీవులు దాటాయి. అనుకున్న టైం కంటే ఓ రోజు ముందే భారతదేశ భూభాగంలోకి ప్రవేశించబోతున్నాయి. ఇది భారత వాతావరణ శాఖ చెబుతున్న సమాచారం. ఇప్పటికే అండమాన్ దీవుల్లో విస్తరించి.. భారత తీరం వైపు కదులుతున్నాయని తెలిపింది. అందుకు అనువైన వాతావరణం ఉందని.. మరో 24 నుంచి 48 గంటల్లో కేరళ తీరాన్ని కూడా తాకవచ్చని వెల్లడించింది వాతావరణ శాఖ.

ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలతోపాటు మాల్దీవుల్లోని కొమరిన్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి విస్తరించి ఉంది. కేరళ దిశగా వడివిడిగా అడుగులు వస్తోంది. దీనికితోడు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి ఉంది. ఈ పీడనం కూడా నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించటానికి దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వేగంతో అంచనా వస్తే.. కేరళలో తొలకరి జల్లులు పడటానికి మరో 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఎంతో ఆలస్యం అనుకున్నా.. మంగళవారం రాత్రికి కచ్చితంగా కేరళ తీరాన్ని నైరుతి తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. మే 30వ తేదీకి దేశంలోకి నైరుతి ప్రవేశిస్తుందని అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 24 గంటలు ముందుగానే చల్లని కబురు తీసుకొస్తోంది వాతావరణం. ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించటానికి 10 నుంచి 12 రోజుల సమయం పట్టొచ్చు. అంటే 8, 9 తేదీల్లో తెలంగాణలోనూ తొలకరి ఉంటుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy