చాక్లెట్లు కొనిస్తానని లైంగిక దాడి : సింగపూర్‌లో భారతీయుడికి 13 ఏళ్ల జైలు

 సింగపూర్ లోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేసే ఉదయ్ కుమార్ దక్షిణామూర్తి (31) అక్కడి ఓ మైనర్ ను అత్యాచారం చేశాడు. అతను పనిచేసే షాపింగ్ మాల్ కు చాక్లెట్లు కొనుక్కోడానికి వచ్చే 12 ఏళ్ల బాలికకు అప్పుడప్పుడు చాక్లెట్లు, స్వీట్లు కొనిచ్చేవాడు. దీంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడడంతో.. తరచుగా బయటకు వెళ్లేవారు. అలా పలుసార్లు తన ఫ్లాట్ కు తీసుకెళ్లి లైంగికంగా అనుభవించాడు. ఎవరైనా అడుగుతే ఉదయ్ మా అంకుల్ అని చెప్పేది. అతను మాత్రం ఆ మైనర్ ను తన భార్య అని చెప్పేవాడు.

ఉదయ్ కు అంతకు ముందే గర్ల్ ఫ్రెండ్ ఉంది. తనను నిర్లక్షం చేస్తున్నాడని గ్రహించిన ఆమె.. ఒక సారి ఉదయ్ సెల్ ఫోన్ ను చెక్ చేసింది. అందులో ఓ మైనర్ అమ్మాయితో శారీరకంగా కలిసి ఉన్న వీడియోలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. 2016 అక్టోబర్ లో ఈ ఘటన జరుగగా తాజాగా  తీర్పును వెలువరించింది అక్కడి కోర్టు. ఉదయ్ కు 13 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు.. 12 కొరడా దెబ్బలను కొట్టాలని తీర్పిచ్చింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy