చార్మినార్ లో సీఎస్ SK జోషి పర్యటన

CS TSహైదరాబాద్ లో చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్టు పనులను శనివారం (మే-5) ఆకస్మికంగా తనిఖీ చేశారు సీఎస్ ఎస్కే జోషి. ఆయనతోపాటు ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ , GHMC ఇన్ చార్జీ కమిషనర్ భారతి హోలికేరి, వివిధ శాఖల ఉన్న తాధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్. వీధి వ్యాపారుల కోసం సాలర్ జంగ్ మ్యూజియం ఎదురుగా మూసిపై ప్రత్యేక నిర్మాణాలు చేయాలని, లాడ్ బజార్ , ముర్గిచౌక్ , చార్ కమాన్ , క్లాక్ టవర్ , మోజంజాహీ మార్కెట్ పునర్నిర్మాణ పనుల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు సీఎస్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy