చాలా లైట్ గా : జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ప్రకంపనలు

earthquake-jubliehillsహైదరాబాద్ సిటీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో నవంబర్ 15వ తేదీ బుధవారం ఉదయం మూడు సార్లు భూప్రకంపనలు నమోదు అయ్యాయి. ఉదయం 8:20 గంటలకు, 8:35 గంటలకు, 8:50 గంటలకు వరసగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 0.3 నుంచి 0.5గా నమోదు అయ్యింది. భూ ప్రకంపన కేంద్రం కేబీఆర్ పార్క్. ఇక్కడి నుంచి మొదలైన ప్రకంపనలు చుట్టూ విస్తరించి ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు విస్తరించింది. ఇది చాలా స్వల్పం అని.. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది NGRI (నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇండియా).

హైదరాబాద్ లో భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయి. నీటి నిల్వలు పెరగటం వల్ల భూమిలోని పలకల మధ్య సర్దుబాటు కారణంగా ఈ ప్రకంపనలు వచ్చాయని తెలిపారు అధికారులు. ఇవి సాధారణంగా వస్తుంటాయని.. ఎలాంటి భయాందోళనలు వద్దని భరోసా ఇచ్చారు. ఇటీవలే బోరబండ, రెహ్మత్ నగర్ ప్రాంతాల్లోనూ ఇదే విధంగా భూ ప్రకంపనలు వచ్చాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy