చికెన్ షాపులు విన్నారా : కోడి ముందు.. మరో కోడిని చంపటం నేరం

chicken-shopటైటిల్ చూసి షాక్ అయినట్లు ఉన్నారు.. ఆదివారం వస్తే లక్షల కోళ్లను చంపి మరీ చికెన్ కర్రీ, ఫ్రై, బిర్యానీతో లాగించేస్తుంటారు జనం. అంతేనా.. చికెన్ షాపుల ఎదుట క్యూ. మంచి కోడి కొట్టు.. దిట్టంగా ఉండాలి.. ముక్కులు ఎక్కవ రావాలి.. ఎముకలు వద్దు.. స్కిన్ వద్దు అంటూ తమ టేస్ట్ కూడా చెబుతుంటారు కస్టమర్లు. దీనికితోడు చవటానికి రెడీగా ఉన్న కోళ్లను చూసి అది కొట్టు.. ఇది కొట్టు అని కూడా చికెన్ షాపు ఓనర్లకు చెబుతుంటారు. ఇదంతా ఏ చికెన్ షాపులో అయినా జరిగే తంతు అయితే.. ఇలా చేయటం నేరం, ఘోరం అంట. ఏంటీ ఇప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలు, నిబంధనల ఉల్లంఘనలను చెబుతున్నారు హ్యూమన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎండీ జయసింహ, పీపుల్ ఫర్ యానిమల్స్ కార్యకర్త నరేంద్ర ప్రసాద్.

ఓ కోడి ముందు.. మరో కోడిని చంపటం నేరం, అంతేకాదు కస్టమర్ల ఎదుట కూడా వాటిని కోయటం నేరం అంటున్నారు. దీనికితోడు చికెన్ షాపులకు తీసుకొచ్చే కోళ్లకు ఆహారం, మంచినీళ్లు ఇవ్వకుండా గ్రిల్స్ రోజుల తరబడి పెడుతున్నారని.. ఇది మరో ఘోరం అంటున్నారు. ఇది చట్టంలోనే ఉందని.. కానీ ఎవరూ అమలు చేయటం లేదన్నారు. జంట నగరాల్లోని చికెన్ షాపు ఓనర్లకు కనీస అవగాహన లేకుండా పోయిందన్నారు. దీనిపై జీహెచ్ఎంసీకి కంప్లయింట్ చేసినట్లు చెబుతున్నారు. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం కోడి రక్తం డ్రైనేజీల్లోకి వదలకూడదు అన్నారు. ప్రతి షాపులో సీసీకెమెరా పెట్టాలని.. ఓ జంతువు ముందు.. మరో జంతువును ఎలా చంపుతారని నిలదీస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని ఏ షాపుకూ లైసెన్స్ లేదని.. ఎవరూ సీసీ కెమెరాలు పెట్టటం లేదన్నారు. కస్టమర్ల ముందు కోడిని చంపటం కూడా నేరం అనే విషయం కూడా తెలియకపోవటం విడ్డూరం అంటున్నారు. శుభ్రత అసలు పాటించటం లేదన్నారు. మొత్తానికి కోడి ముందు.. మరో కోడిని చంపటం నేరం అనే విషయం చాలా మందికి తెలియకపోవటం ఆశ్చర్యం, విడ్డూరంగానే ఉంది కదా… ఇక నుంచి అయినా ఈ రూల్ పాటిస్తారో లేదో చూడాలి…

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy