చిక్కుల్లో సుష్మ!

LALITHవిదేశాంగ మంత్రి  సుష్మా స్మరాజ్… చిక్కుల్లో పడ్డారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ వీసా ఇష్యూ.. సుష్మా సీటుకు ఎసరు తెచ్చింది. లలిత్ మోడీకి సుష్మా.. ట్రావెలింగ్ వీసా ఇప్పించడం కాంట్రావర్శీ అయింది. సీన్ లోకి వెళ్తే.. లండన్ లో ఉంటున్న లలిత్ మోడీ.. పోర్చుగల్ వెళ్లేందుకు ట్రావెలింగ్ వీసా ఇప్పించాలని 2014 జులైలో సుష్మాకు రిక్వెస్ట్ చేశారు. తన భార్య కేన్సర్ తో బాధపడుతోందని.. పోర్చుగల్ లో ఆపరేషన్ చేయించాలని ట్వీట్ చేశారు. ఆపరేషన్ డేట్ ఆగస్టు 4న ఫిక్స్ అయిందని సుష్మాకు విన్నపాలు చేశారు. లలిత్ మోడీ రిక్వెస్ట్ కు కరిగిపోయిన సుష్మా… మానవతకోణంలో లలిత్ కు ట్రావెలింగ్ వీసా అలాట్ చేయాలని బ్రిటిష్ హైకమిషనర్ ను కోరారు.

బ్రిటన్ లో ఎన్నారై ఎంపీ కీత్ వాజ్ ఎపిసోడ్ తో లలిత్ మోడీ ట్రావెలింగ్ వీసా ఇష్యూ బయటపడింది. కీత్ వాజ్ వీసా ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. సేమ్ టైమ్ లలిత్ మోడీ వీసాపై ..బ్రిటిష్ హైకమిషనర్ కు కీత్ వాజ్ లెటర్ రాసినట్టు తెలిసింది. ఈ లెటర్ లో సుష్మా విషయాన్ని కూడా ఇన్ఫామ్ చేసినట్టు సమాచారం. లలిత్ మోడీ ట్రావెలింగ్ వీసాపై కేంద్రమంత్రి సష్మా రియాక్ట్ అయ్యారు. హ్యూమన్ యాంగిల్ లోనే వీసా ఇవ్వాలని చెప్పినట్టు ట్వీట్స్ చేశారు సుష్మా.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy