చిచ్చరపిడుగుకు యూట్యూబ్ కిరీటం

Heaven_King youtub‘మినీ బియాన్స్’గా  పేరొందిన నాలుగేళ్ల  చిచ్చరపిడుగు ఈ ఏడాది యూట్యూబ్‌ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. అదరిపోయే తన స్టెప్పులతో ఈ చిన్నారి పెట్టిన డ్యాన్స్ వీడియో 2015 సంవత్సరంలో అత్యధిక వ్యూస్‌ సాధించింది. ర్యాపర్ సైలెంటో పాడిన ‘వాచ్‌ మి’ పాటకు న్యూయార్క్ వీధుల్లో ఈ బుజ్జాయి వేసిన స్టెప్పులకు వీక్షకుల నుంచి అదరహో అనే రెస్పాన్స్ వచ్చింది. చిన్నారి ‘హేవన్‌ కింగ్‌’  డ్యాన్స్ వీడియోను ఇప్పటివరకు 16.6 కోట్ల మంది చూశారని… ఈ ఏడాది అత్యధికంగా చూసిన వీడియో ఇదేనని గూగుల్ లీడ్ చేస్తున్న యూట్యూబ్‌ ప్రకటించింది. ఇక సెకండ్ ప్లేస్ లో నటుడు లియాన్ నీసన్ నటించిన ‘క్లాష్ ఆఫ్ క్లాన్స్’ వీడియో గేమ్‌ నిలిచింది. చూసిన వాళ్లు 8.3 కోట్లు. ‘హేవన్ కింగ్’ చిన్నారి వీడియో పోల్చుకుంటే రెండోస్థానంలో ఉన్న వీడియోకు సగం వ్యూస్‌ కూడా రాలేదట.

you tub baby

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy