చిత్రం.. భళారే విచిత్రం: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మగాడు

mirracle-birthమగాళ్లు పిల్లల్ని కనడం చిత్రాతి చిత్రమే. ఆధునిక సాంకేతిక యుగంలో ఇవన్నీ నిజమవుతున్నాయి. పిల్లల్ని ఆడవాళ్లు మాత్రమే కనాలా అంటూ.. ఈ రోజుల్లో కొంత మంది మగాళ్లు పిల్లల్ని కనడానికి రెడీ అవుతున్నారు. లింగ మార్పిడితో దాన్ని సుసాధ్యం చేస్తున్నారు.  ఓ యువకుడు లింగమార్పిడి ద్వారా చిన్నారి బాబుకు జన్మనిచ్చాడు. ఈ అరుదైన ఘటన.. అమెరికాలోని పోర్టులాండ్ లో జరిగింది. ట్రైస్టన్ రీజ్ అనే 34 ఏళ్ల యువకుడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చాడు.  గత నెల(జూలై) 14న చిన్నారి లియోకు జన్మనిచ్చాడు. ట్రైస్టన్ రీజ్ – బీఫ్ చాప్లో అనే దంపతుల ఇంట లియో రావడంతో సంతోషానికి అవధులు లేవు. ఆ దంపతులు లియో రాక ముందే బీఫ్ చాప్లో బంధువుల పిల్లలిద్దరిని దత్తత తీసుకున్నారు.

రీజ్ కు అప్పుడే పుట్టిన ఆ అందమైన చిన్నారి 9.5 పౌండ్లు..21.5 ఇంచులు ఉన్నాడు. అంటే చాల ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ముద్దుగా బొద్దుగా ఉన్న లియో అంటే ఆ దంపతులకు అంతులేని ప్రేమ.  ఆ బేబీని మోస్తున్నప్పుడు నా శరీరంలో ఎన్నో మార్పులు సంభవించాయంటున్నాడు రీజ్. ఆ శిశువును మోయడం, జన్మ నివ్వడం నా జీవితంలో మరిచిపోలేని మధుర సంఘటన అంటున్నాడాయన. ఆ చిన్న మనిషి నా గర్భం నుంచి బయటకు రావడం అద్భుతం అని వ్యాఖ్యానించాడు ట్రైస్టన్ రీజ్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy