చిదంబరానికి మరోసారి ఊరట

chiకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో మళ్లీ ఊరట లభించింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో చిదంబరాన్ని జులై 10 వరకు అరెస్ట్‌ చేయవద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)ని ఆదేశించింది కోర్టు. ఇటీవల చిదంబరం ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకోగా దీనిపై జూన్‌ 5లోగా స్పందించాలని కోర్టు ఈడీని కోరింది. మంగళవారం (జూన్-5) విచారణలో ED మరింత గడువు కావాలని అడిగింది. దీంతో కోర్టు ఆయనకు మరికొన్ని రోజులు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించింది. ఈ కేసులో చిదంబరం కొడుకు కార్తి చిదంబరాన్ని కూడా జులై 10 వరకు అరెస్ట్‌ చేయరాదంటూ కోర్టు తీర్పిచ్చింది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy