చిన్నమ్మ వెలి

palani-sasikalaకొన్ని రోజులుగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. జయ శకం ముగిసి.. చిన్నమ్మ శశికళ శకం మొదలైందనుకుంటున్న సమయంలో.. ఆమెను పూర్తిగా దూరం పెట్టేసింది అధికార అన్నాడీఎం పార్టీ. పేరు ప్రస్తావించకుండానే శశికళ కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా పెడుతున్నట్టు ప్రకటించింది. ప్రజల్లో పార్టీ పట్ల సన్నగిల్లుతున్న అభిమానాన్ని.. అలాగే రెండాకుల గుర్తు కోల్పోకుండా ఉండాలంటే.. ఈ నిర్ణయాలు తప్పనిసరని భావించింది సీఎం పళనిస్వామి టీమ్. రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం మేరకు అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ టీటీవీ దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని (శశికళ పేరు ప్రస్తావించకుండా) పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి వెలివేశారు. దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఈ. కె.పళనిస్వామి మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది.  ప్రజలు, పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఆర్థిక మంత్రి డి.జయకుమార్‌.

పార్టీని అప్రతిష్టపాలు చేసే విధంగా దినకరన్ ప్రవర్తించాడనే ఆరోపణలతోనే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారని తెలుస్తోంది. పార్టీ చిహ్నం కోసం లంచం ఇచ్చారని.. ఆర్కే నగర్ లో అభ్యర్థులకు నోట్లు పంచారని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దినకరన్. వీటితో పాటు అన్నాడీఎంకేలోని రెండు గ్రూపులూ విలీనం కావడానికి చర్చలు జరపాలంటే… పార్టీ జనరల్‌ సెక్రటరీ శశికళను, ఆమె మేనల్లుడు దినకరన్‌ను సాగనంపాలనే షరతు పెట్టింది పన్నీర్ సెల్వం వర్గం.  వీటిపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ చివరకు శశికళ వర్గాన్ని సాగనంపడానికే నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy