చిన్నారి మీనా అంత్యక్రియలు పూర్తి

meenaరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లి గ్రామంలో బోరుబావిలో పడి మృతిచెందిన చిన్నారి మీనా అంత్యక్రియలు స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. అరవై గంటలకు పైగా శ్రమించినా కనీసం పాప మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోవటం విచారకరం.  బోరుబావిలో ఫ్లషింగ్ చేయగా చిన్నారి మీనా అవశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. వాటిని శవ పరీక్ష కోసం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. తర్వాత మృతదేహాన్ని స్వగ్రామమైన వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం గొరెపల్లికి తరలించారు. అక్కడి శ్మశానవాటికలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చిన్నారి మృతిలో గ్రామమంతా విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి చిన్నారికి నివాళులర్పించారు.

ఆదివారం (జూన్ 25) తెల్లవారు జాము నుంచి ఎయిర్ ప్రెషర్ ద్వారా పాపను బోరు బావిలోంచి బయటకు తీయాలని చేసిన చివరి ప్రయత్నం కొంత మేలని అధికారులు భావించారు. అయితే ఫ్లషింగ్‌తో మృతదేహాన్ని బయటకు తీయాలని చూడగా మొదటగా బోరు బావి నుంచి దుర్వాసన వచ్చింది. ఆపై చిన్నారి దుస్తులు బయటకు వచ్చాయి. ఇది చూడగానే చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆపై మరికాసేపు ఫ్లషింగ్ చేయగా చిన్నారి మీనా అవశేషాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఆ తల్లిదండ్రులకు తమ ముద్దుల చిన్నారి రూపాన్ని కడసారి చూపు సైతం దక్కలేదని స్థానికులు ఆవేదన చెందారు. దాదాపు మూడు రోజులుగా నీళ్లు, మట్టిలో చిన్నారి కూరుకుపోవడంతో చనిపోయి మృతదేహం కుళ్లిపోయింది. కేవలం పాప అవశేషాలు ఒక్కొక్కటిగా చూడాల్సి రావడంతో కడసారి చూపును సైతం కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy