చిన్నారులకు బీర్ తాగిస్తున్న పాపాత్ములు

beerనాలుగేళ్ల చిన్నారికి న‌లుగురు వ్య‌క్తులు క‌లిసి బీరు తాగించిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని తిరువ‌న్న‌మ‌లై జిల్లాలో చోటుచేసుకుంది. ఆ చిన్నారికి ఓ క‌ప్పులో బీరు పోసి తాగించ‌డ‌మే కాదు ఆ సీన్‌ను వీడియో కూడా తీశారు. ఆ వీడియో ఇంట‌ర్‌నెట్‌లో వైర‌ల్ అవ్వ‌డంతో పోలీసులు సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. ఇందులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై అంటెప్ట్ టూ మ‌ర్డ‌ర్ కేసును న‌మోదు చేశారు. మ‌రో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక‌టి న‌ర్ర నిమిషం నిడివి గ‌ల ఆ వీడియోలో ఆ చిన్నారిని త‌మ లాగా తాగాల్సిందిగా ప్రోత్స‌హించ‌డం ఉంద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం ఆ బాలుడు బాగానే ఉన్న‌ట్లు చెప్పారు.

మ‌రో ఘ‌ట‌న‌లో  ఓ చిన్నారికి సొంత తండ్రే ఆల్క‌హాల్‌ను తాగిస్తున్న‌ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. దీనిపై రియాక్ట్ అయ్యింది మ‌హిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ‌. వీడియోలో ఉన్న వ్య‌క్తిపై స‌మాచారం ఇవ్వాల్సిందిగా ప్ర‌జ‌ల‌ను ట్విట‌ర్ ద్వారా కోరింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy