చిన్నారుల కోసం కైలాష్ సత్యార్థి భారత్ యాత్ర

kailash-satyarthiనోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి దేశవ్యాప్త పర్యటనకు రెడీ అవుతున్నారు. దీనికి భారత్ యాత్ర పేరు ఖరారు చేశారు. సురక్షిత్ బచ్ పన్.. సురక్షిత్ భారత్ నినాదంతో సాగనున్న ఈ యాత్ర.. సెప్టెంబర్ 11న మొదలై అక్టోబర్ 16న ముగియనుంది. ఓ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ వచ్చిన ఆయన.. చిన్నపిల్లల రక్షణ కోసం పార్లమెంట్‌లో కఠిన చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నారులపై జరుగుతున్న వేధింపులు, లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఈ యాత్ర నడుస్తుందన్నారు.  యాత్రలో భాగంగా కోటిమందిని కలవాలని యత్నిస్తున్నట్లు కైలాశ్ సత్యార్థి తెలిపారు. సురక్షిత్ బచ్‌పన్-సురక్షిత్ భారత్ యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21న హైదరాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. 22 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గుండా 35 రోజులపాటు ఈ యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. యాత్రకు రాష్ట్రపతి, ప్రధాని పూర్తి మద్దతు తెలిపారని అన్నారు సత్యార్థి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy