చిన్నారుల మృతిపై విచారణకు సోనియా డిమాండ్‌

SoniaGandhi-30Mar_PTIఉత్తరప్రదేశ్‌లోని బాబా రాఘవదాస్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో చిన్నారుల వరుస మరణాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. ఈ అంశంపై భిన్నమైన కారణాలు చెప్తున్న నేపథ్యంలో.. గ్యాస్‌ సరఫరాదారులు సంబంధిత అధికారులకు బాకీల చెల్లింపు అంశంపై లేఖ రాసినట్లు వెల్లడైంది. ఈ నెల 3, 10 తేదీల్లో గ్యాస్‌ సరఫరా చేసే పుష్ప కంపెనీ బాకీలు చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తామని ఆసుపత్రికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. చిన్నారుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పలు పార్టీల నేతలు ఈ అంశంపై తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బాధ్యులపై కఠిన చర్యలకు సోనియా డిమాండ్‌

పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎస్పీ, బీఎస్పీ నేతలు డిమాండ్‌ చేస్తుండగా.. గులాంనబీ అజాద్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలతో కూడిన బృందం ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రి వద్ద పరిస్థితులు, చిన్నారుల మృతికి కారణాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే చిన్నారుల మృతి ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy