చిన్న పిల్లలకు అమ్ముతున్నారు : గంజాయి ముఠా అరెస్ట్

GANJAఅభం శుభం తెలియని పిల్లలే వారి టార్గెట్. గంజాయికి అలవాటు చేస్తూ..సీక్రెట్ గా సరఫరా చేస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ స్మగ్లింగ్ తో ఎంతో మంది స్టూడెంట్స్ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముఠాగుట్టు రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళవారం (జూన్-12) స్కూల్, కాలేజీ విద్యార్థులకు గంజాయి సప్లై చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వీరి దగ్గర నుంచి 60 వేల రూపాయల విలేవైన ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జహీరాబాద్ పట్టణంలో 45 మంది విద్యార్థులకు ఈ ముఠా గంజాయి సప్లై చేస్తున్నట్లు తెలిపారు. 45 మంది పిల్లల్లు గంజాయికి అలవాటు పడినట్లు తమ ఇన్వెస్టిగేషన్ లో తేలిందని తెలిపారు పోలీసులు. పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసేకోవాలని చెప్పినట్లు వెల్లడించారు పోలీసులు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy