చిరిగిన చొక్కాతో అసెంబ్లీ నుంచి స్టాలిన్

stalinడీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, డీఎంకే లీడర్ స్టాలిన్ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ నుంచి చిరిగిన చొక్కాతో బయటకు రావటం కలకలం రేపింది. అసెంబ్లీలో పోలీసులు వ్యహరించిన తీరు ఇలా ఉందంటూ చొక్కా చూపించారు. సభలో సభ్యుల కంటే పోలీసులే ఎక్కువగా ఉన్నారని.. న్యాయబద్దంగా ఓటింగ్ అడిగితే ఏ విధంగా వ్యవహరించారో చూడండి అంటూ స్పీకర్ వైఖరిని ఖండించారు. సీక్రెట్ బ్యాలెట్ పెట్టాలని అడిగామని.. ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని కోరామని దీనికే బలవంతంగా సభ నుంచి గెంటేశారని ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. సభలో బైఠాయించిన తమను మార్షల్స్ తో బయటకు ఈడ్చేశారన్నారు స్టాలిన్.  సభలో తమకు జరిగిన అన్యాయాన్ని, స్పీకర్ వైఖరిని గవర్నర్ కు వివరించడానికి డిఎంకే సభ్యులు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును కలిశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy