చిరు ‘స్టాలిన్’ బాటలో మోడీ సమ్మర్ ఆఫర్

narendra-modiమీరు ముగ్గురికి సాయం చేయండి… ఆ ముగ్గరిని చెరో ముగ్గురికి సాయం చెయ్యమని చెప్పండి.. అంటూ స్టాలిన్ సినిమాలో సందేశమిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతున్నారు పీఎం మోడీ. భీమ్ యాప్ ను ప్రమోట్ చేసే పనిలో ఉన్న మోడీ… ఆ యాప్ యూజర్లకు భారీ నజరానాలు ప్రకటించారు. ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వాళ్లు మరికొంతమందితో  ఇన్ స్టాల్ చేయించండని చెబుతున్నారు.

అలా చేసి… మూడు లావాదేవీలు చేయిస్తే.. 10 రూపాయలు  మీ అకౌంట్ లో చేరుతాయి. ఇలా రోజుకు 20 మందితో చేయిస్తే … 200 రూపాయలు అకౌంట్ లో చేరినట్టేనని చెబుతున్నారు పీఎం. దీని ద్వారా సమ్మర్ హాలిడేస్ లో పేద విద్యార్థులకు డబ్బు సంపాదనకు వెసులుబాటు కల్పించినట్టేనని అంటున్నారు మోడీ. అక్టోబర్ 14 వరకు ఈ ఆఫర్ ను ప్రకటించింది కేంద్రం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy