చిలకలగుట్ట నుంచి బయల్దేరిన సమ్మక్క

SAMFFవనదేవత సమ్మక్క చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వైపు బయల్దేరింది. జిల్లా అధికార యంత్రాంగం సమ్మక్కకు ఘనస్వాగతం పలికారు. అనవాయితీ ప్రకారం జిల్లా ఎస్పీ భాస్కరన్ గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున కోయదొరలకు అడవిలో చుట్టూ పులుల సంరక్షణలో దొరికిన శిశువు. సమ్మక్కగా నామకరణం జరిగి కోయవారి ఇంట అల్లారుముద్దుగా పెరిగిన కూన. యుక్తవయస్సులో కరీంనగరు ప్రాంతాన్ని ఏలే పగిడిద్దరాజుతో వివాహం జరిగింది. కదనరంగాన వీరవనితగా పేరు గాంచింది. కప్పం కాదన్నందుకు మేడారంపై దండెత్త వచ్చిన కాకతీయ సేనలను ధీటుగా ఎదుర్కొని చిలుకలగుట్టలో అంతర్ధానమైంది. కుంకుమభరిణె రూపంలో వెలసి, భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy