చివరి లేఖ చదివితే కన్నీళ్లు ఆగవు : ఓ యువ రైతు ఆత్మహత్య

farmerరంగారెడ్డి జిల్లా రంగాపూర్ లో  ఘోరం జరిగింది. అప్పుల  బాధతో  యువ రైతు దంపతులు ఆత్మహత్య  చేసుకున్నారు. పెండ్యాల  మోహనాచారి, సరిత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  తొమ్మిది ఎకరాల్లో కోళ్ల  ఫాం, పాడి పశువులు  పెంచుతున్నారు. నీళ్ల కోసం  20 బోర్లకు పైగా వేసినా.. ఒకటీ పడలేదు. లాభాలొస్తయని గొర్రెలు పెంచితే.. అవి  రోగాలతో చనిపోయాయి. దీంతో అప్పులు  పెరిగిపోయాయి. కొత్త  అప్పుల కోసం తిరిగినా దొర్కపోవడంతో..  ఉరేసుకుని చనిపోయారు దంపతులు. ఆఖరికి  బ్యాంకుకు వెళ్లినా  ఇవ్వలేదని సూసైడ్ లెటర్ రాశాడు  మోహనాచారి. పదేళ్లపాటు యువరైతు మోహనాచారి పడిన కష్టం.. వ్యవసాయంపై ఉన్న ప్రేమ చివరికి ప్రాణాలు తీసుకునేలా చేసింది. తనతోపాటు భార్యను కూడా తీసుకెళ్లిపోయాడు.

యువరైతు మోహనాచారి సూసైడ్ నోట్ యథాతథంగా ఇలా ఉంది :

నా మనసుకు నచ్చినంత వరకు చదువు సాగించి.. నేపొందిన విజ్ఞానం ప్లస్ నా మనసు చెప్పినట్లు ఆలోచించి మాకున్న గుట్టలు, రాళ్లు, ఎగుడు దిగుడుగా ఉన్న లావణి పట్టా 9.10 ఎకరాలు. ఈ వ్యవసాయ పొలాన్నే నా ఐడియాస్ ప్రకారం చదును చేసి.. ఉన్న వాటర్ సోర్స్ ను యూజ్ చేస్తూ.. నేను మరియు కొందరికైనా ఉపాధి కల్పించాలని నాకొరిక. ఈ తలంపుతో 2వేల సంవత్సరం నుంచి బాస్ మతి, సోనామసూరి, మిర్చి లాంటి పంటలు పండిస్తూ ఉండగా కరువులు, ఆకాల వర్షాలు, నెమళ్లు, అడవి పందుల బెడద వల్ల పంటలు లాస్ కవడం గమనించి 2011 సంవత్సరంలో.. మూడు HF ఆవులతో డైయిరిని మరియు 12వేల కోడిపిల్లలతో బ్రాయిలర్ ఫామ్ వేసినాను. 7 బ్యాచ్ లలోనే వారి మోసాలు తెలిసి స్టాప్ చేసినాను. డైయిరీ కొనసాగిస్తూనే 2014 సంవత్సరంలో మా బంధువుల ఫ్లాట్స్ కొల్లట్రాల్ సెక్యూరిటీస్ గా ఆంధ్రాబ్యాంక్ లో పెట్టి 13లక్షల 45వేలు లోన్ తీసుకుని 268 గొర్రెలు తెచ్చి పెంచుతూ ఉండగా.. 2015 జనవరిలో వైరస్ ప్రబలి 164 గొర్రెలు చనిపోవడం వల్ల తీవ్రమైన లాస్ జరిగింది. ఈ టైమ్ లో లోన్ వాయిదాల చెల్లింపులో గ్రేస్ పిరియడ్ మరియు కొంత మొత్తం లోన్ గా ఇచ్చి మమ్మల్ని ముందుకు సాగునట్లు చేయవల్సిందిగా కోరుతూ వచ్చాము. పైగా కరువుల వలన బోర్లలో నీరు లభించక ఉన్న ఆవులు, గేదేలు, గొర్రెలను పోషించడం కష్టంగా మారి వీటి పోషణకు తెలిసినవారి దగ్గర అప్పులు చేస్తూ పోషించడము జరుగుతూ వస్తుంది. పైగా లోన్ వాయిదాలు చెల్లింపులో డైయిరీ వల్ల వచ్చే ఇన్ కమ్ సరిపోక ఆవులను, గేదేలను మరియు గొర్రెలను కూడా అమ్ముతూ లోన్ వాయిదాలు చెల్లిస్తూ వచ్చాము. ఇప్పటివరకు ఇలా 6 లక్షల 28వేలు లోన్ వాయిదాలు చెల్లించినాము. ఇలా లోన్ వాయిదాలు చెల్లించిన ప్రతిసారి నేను గ్రేస్ పీరియడ్ ఇవ్వమని మరియు కొల్లెట్రెడ్ సెక్యూరిటీస్ ఎక్కువగా ఉన్నది కావున ఇంకా కొంచెం లోన్ ఇవ్వగలిగితే లోన్ వాయిదాలు చెల్లించడానికి ఇన్ కమ్ సోర్స్ డెవలప్ అయ్యేటల్లు చేసుకుంటాము అని పదే పదే విన్నవించినా ఒకరు చేస్తామని, ఇంకొకరు వీలుకాదని కాలం వృధా చేస్తున్నారు కాని ఎలాంటి సహకారము నాకు చేయలేదు. ఇలా ఆవులు, గెదేలు, గొర్రెలు సంతతి కూడా తగ్గిపోవడం జరిగింది. ఇకపై లోన్ వాయిదాలు చెల్లించట భారంగా మారింది. చివరి ప్రయత్నంగా జూన్ 21 నాడు ఆంధ్రా బ్యాంక్ రిజీనల్ ఆఫీసుకు వెళ్లి ఎలాగైనా మాకు సహాయము చేయమని ఎన్నో రకాలుగా కోరినా వాళ్ల రూల్స్ కు వ్యతిరేకంగా చేయలేమని ఖరాఖండిగా చెప్పినారు. ఇలా బంధువుల ఆస్తులు కూడా కాపాడలేని పరిస్థితి వచ్చింది. ఇకపై జీవితంలో ముందుకు సాగడానికి ఎలాంటి మార్గం కనిపించడం లేక ఈ తనువును వదిలివేయడమే మార్గం అని నిర్ణయించుకున్నాను.

1
23

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy