
అంతకముందు ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ స్వచ్ఛ భారత్ పై విమర్శలు చేశారు. ప్రతీ ఒక్కరి చేత చీపురు పట్టించినంత మాత్రాన దేశం క్లీన్ అయిందా అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో ఉన్న నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ని క్లియర్ చేసేందుకే పెద్ద నోట్ల రద్దు చేశారని ఆరోపించారు
రాహుల్ కు కౌంటరిచ్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. మోడీపై సోనియా గాంధీ ఎలాంటి విమర్శలు చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. ఏ ఒక్క కుంభకోణానికి కూడా మన్మోహన్ బాధ్యత తీసుకోలేదన్న అమిత్ షా… ప్రధాని విమర్శలు కరెక్టేనన్నారు. ఉత్తరాఖండ్ లోని తెహ్రీ, కాశీపూర్ లలో ప్రచారం చేసిన అమిత్ షా… కుంభకోణాల నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు.
అభివృద్ధిని మరింత విస్తృతం చేసేందుకు మరోసారి అధికారమివ్వాలని ప్రజలను కోరారు సీఎం అఖిలేష్ యాదవ్. మథురలో ప్రచారం చేసిన అఖిలేష్… బీజేపీ మాటలకే పరిమితం అన్నారు. రెండున్నరేళ్లలో యూపీకి బీజేపీ చేసిందేమీలేదన్నారు.
ఎన్నికల టైంలో అఖిలేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యాశాఖా మంత్రిగా ఉన్న శార్ద ప్రతాప్ శుక్లాను మంత్రివర్గం నుంచి తొలగించారు. సీఎం సూచనతో శార్ద ప్రతాప్ శుక్లాను బర్తరప్ చేశారు గవర్నర్. సరోజినీ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శుక్లా శివపాల్ వర్గంలో ముఖ్యుడిగా ఉన్నారు. శివపాల్ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్ లో శుక్లాకు ప్లేస్ దక్కగా… అఖిలేష్ విడుదల చేసిన లిస్ట్ లో మాత్రం చోటు దక్కలేదు. పార్టీ మొత్తం అఖిలేష్ చేతుల్లోకి వెళ్లడం… టిక్కెట్ దక్కకపోవడంతో… RLD నుంచి బరిలో దిగారు శుక్లా. దీంతో శుక్లాను బర్తరఫ్ చేశారు అఖిలేష్.
ఈ సాయంత్రంతో… ఉత్తరప్రదేశ్ లో మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం నాడు 73 నియోజకవర్గాల్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కీలక నేతలంతా… ఇవాళ ఉత్తరాఖండ్ లో ప్రచారం చేశారు. BSP చీఫ్ మాయావతి హరిద్వార్ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.