చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా ప్రమాణస్వీకారం

DEEPAKసుప్రీంకోర్టు 45వ చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

1977లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు మిశ్రా. 2010లో ఢిల్లీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా పని చేశారు. ఆ తర్వాత 2011లో సుప్రీంకోర్టుకి అపాయింట్ అయ్యారు. అంతకు ముందు 1996 – 2009 వరకు ఒరిస్సా, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో పని చేశారాయన. 2009లో పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిగా నియమితులయ్యారు. సుదీర్ఘ అనుభవం ఉన్న దీపక్ మిశ్రా.. సీనియార్టీ ఆధారంగా సుప్రీంకోర్టు 45వ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy