చీమలదండులా సిరియా వాసులు

article-3289031-2DC8F7B300000578-668_636x417పుట్టిన ఊరు ఉగ్రవాద దాహానికి అల్లాడిపోతోంది. వల్లకాడవుతోంది. ఏం చెయ్యాలో తోచక… ప్రాణాలు అరచేతిలో పట్టుకొని.. పిల్లాపాపలతో పక్షుల్లా దేశాలు దాటి పోతున్నారు. సొంతూళ్లు వదిలి.. పట్టణాలు.. సముద్రాలు దాటి.. దేశాలకు వలసపోతున్నారు. ఇదంతా ఎవరి గురించో అర్థమయ్యే ఉంటుంది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణహోమానికి అక్కడి భూమి పుత్రులు విలవిల్లాడుతున్నారు. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ విధ్వంసంలో.. ప్రాణాలు దక్కించుకున్న వాళ్లు.. మైగ్రేట్ అవుతున్నారు. అలా వెళ్లే వారితో యూరోపియన్ దేశాల సరిహద్దులు నిండిపోతున్నాయి. లక్షలాది మంది వలసలతో చీమలదండుల్లా.. మారిపోతున్నాయి. అసలే చలికాలం. గడ్డ కట్టే చలిని లెక్కచేయక… దుమ్ము ధూళి కమ్ముకొస్తున్నా… వర్షంలో తడుస్తున్నా… బతుకు మీద ఆశతో… వెళుతున్నారు. ఇలా వెళుతున్న శరణార్థులను హెలికాఫ్టర్ నుంచి క్లిక్ చేశారు. వాటిని మీరూ చూడండి.

ఇదిలా ఉంటే… స్లొవేనియా, క్రొయేషియా, రొమానియా, బల్గేరియా, సెర్బియా.. వీటన్నింటికి వలసలు పోటెత్తడంతో ఆయా దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అసలే యూరో జోన్ సంక్షోభంలో ఉంటే …. ఈ వలసలను ఎలా తట్టుకోవాలని ప్రశ్నిస్తున్నాయి. త్వరగా  వీటికి ఏదైనా పరిష్కారమార్గం చూపాలని లేదంటే యూరో జోన్ నుంచి తప్పుకుంటామని హెచ్చరిస్తున్నాయి.

2DC454B100000578-0-image-a-6_1445802736117

2DC452D900000578-0-image-a-7_1445802744298 2DC6150100000578-3289031-image-a-44_1445805101939 2DC451F300000578-0-image-a-10_1445802754089

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy