చీరాలలో తగలబడిన సురేష్ ధియేటర్

theatre-fireఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని సినిమా ధియేటర్ లో మంటలు చెలరేగాయి. ఉదయ 10 గంటల సమయంలో షాట్ సర్క్యూట్ ఈ ప్రమాదం జరిగింది. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. కొన్ని రోజులుగా ధియేటర్ మూసి ఉంది. ఆధునిక టెక్నాలజీని జోడించి మల్టీఫ్లెక్స్ గా మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే సీట్లు, స్క్రీన్ మార్చారు. సౌండ్ సిస్టమ్ ఛేంజ్ చేయాల్సి ఉంది. గురువారం ఉదయం ఈ పనులు జరుగుతున్న సమయంలో.. కరెంట్ షాట్ సర్క్యూట్ అయ్యింది. వెంటనే మంటలు వ్యాపించాయి. భారీగా మెటీరియల్ ఉండటంతో మంటలు ఎగసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది గంట సేపు ప్రయత్నించిన తర్వాత అదుపులోకి వచ్చాయి. సగంపైనే ధియేటర్ కాలిపోయింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy