చుక్ చుక్ రైలు : ఏడు దేశాలు.. 12వేల కిలోమీటర్ల జర్నీ

An official takes pictures as a train carrying containers from London arrives at the freight railway station in Yiwu12వేల కిలోమీటర్లు… ట్రెయిన్ లో అంత దూరం ప్రయాణించాలంటే… మామూలు విషయం కాదు. అంత దూరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు చైనీయులు. వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో భాగంగా… వన్ బెల్ట్.. వన్ ట్రేడ్ నినాదంతో.. లండన్ నుంచి చైనా వరకు ఈ గూడ్సు రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు మార్గానికి ఈస్ట్ విండ్ అనే పేరు పెట్టారు. 88 కంటైనర్లతో విస్కీ, బేబీ మిల్క్, ఫార్మసూటికల్స్ తదితర సరకులతో చైనా చేరింది. ఇది ప్రపంచంలోనే రెండో పొడవైన రైలు మార్గం. ఇంకో విషయం ఏంటంటే.. ప్రపంచంలోని అత్యంత పొడవైన రైలు మార్గం కూడా చైనాలోనే ఉంది.  ఆకాశ, సముద్ర మార్గాల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండే  విధంగా ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. ఏప్రిల్ 10న లండన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ రైలు. శనివారం చైనాలోని ఇవు నగరానికి చేరుకుంది. నిర్దేశిత సమయం 20 రోజులకు రెండు రోజులు ముందుగానే  గమ్యస్థానాన్ని చేరింది. ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, పోలాండ్, వెలారస్, రష్యా, కజఖస్థాన్ మీదుగా ప్రయాణించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy