చురుగ్గా కదులుతున్న నైరుతీ రుతుపవనాలు…

66రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతీ రుతుపవనాలు… మరో రెండ్రోజుల్లో దేశంలోకి రాబోతున్నాయి. ఎప్పుడొస్తాయో అర్థం కాక కన్ ఫ్యూజ్ చేసిన రుతుపవనాల్లో కదలిక వచ్చిందని గుర్తించింది వాతావరణ శాఖ. ముందుగా అనుకున్నట్లే ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయని చెబుతున్నారు అధికారులు. రెండ్రోజుల క్రితం వరకు కాస్త నెమ్మదిగా ఉన్నా ఇప్పుడు వేగంగా కదులుతున్నాయంటున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. మరో 48 గంటల్లో కేరళ,తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించబోతున్నాయని చెబుతోంది వెదర్ రిపోర్ట్. రాష్ట్రంలోకి మరో వారం తర్వాత ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు అధికారులు.ఇక రానున్న 24 గంటల్లో రాష్ట్రంతో పాటు… ఏపీలోనూ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పలుచోట్ల, రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురుస్తాయని చెబుతున్నారు అధికారులు. సాయంత్రానికి అక్కడక్కడా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది వెదర్ రిపోర్ట్. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy