చెక్ ఇట్ అర్జంట్ : 12 బ్యాంక్ యాప్స్ కి వైరస్ ముప్పు

mbc

ఇండియన్ బ్యాంకింగ్ యాప్స్ రిస్క్ లో ఉన్నాయా.. ప్రపంచవ్యాప్తంగా 232 బ్యాంకింగ్ యాప్స్ కి వైరస్ ముప్పు పొంచి ఉందని.. ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాప్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. అందులో ఇండియాకి చెందిన 12 బ్యాంక్ యాప్స్ కూడా ఉన్నాయి. వెంటనే అప్రమత్తం కావాలని ఆయా బ్యాంకులకు కూడా సమాచారం ఇచ్చింది సంస్థ. ఆండ్రాయిడ్ బ్యాంకర్ ఏ9480 అనే ట్రోజన్ మాల్ వేర్ టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. ఈ ట్రోజన్ మాల్ వేర్ వల్ల ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా బ్యాంక్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్న వారి సమాచారం అంతా బలహీనమైన, హానికర సర్వర్లలో అప్ లోడ్ చేసినట్లు తెలిపింది. యూజర్ల లాగిన్ డేటా, SMS, కాంటాక్ట్ లిస్టులను ఈ మాల్ వేర్ ఈజీగా టార్గెట్ చేస్తున్నట్లు హీల్ సెక్యూరిటీ నివేదికలు చెబుతున్నాయి.

ఇండియాలో యాక్సిస్ మొబైల్, HDFC మొబైల్ బ్యాంకింగ్, SBI ఎనీవేర్ పర్సనల్, HDFC మొబైల్ బ్యాంకింగ్ లైఫ్, ICICI ఐ మొబైల్, IDBI గో మొబైల్, IDBI అభయ్, IDBI ఎం పాస్ బుక్, భరోడా ఎంపాస్ బుక్, యూనియన్ మొబైల్ బ్యాంకింగ్, యూనియన్ బ్యాంక్ కమర్షియల్ క్లయింట్స్ యాప్స్ వినియోగించే వారికి ఈ ట్రోజన్ మాలేవర్ ఎటాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడుతున్న యూజర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

థర్డ్‌ పార్టీ స్టోర్ల ఫేక్‌ ఫ్లాష్‌ ప్లేయర్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ బ్యాంకర్‌ ఏ9480 మాల్‌వేర్‌ విరుచుకుపడుతోందని క్విక్‌ హీల్‌ రిపోర్టు తెలిపింది. ఒక్కసారి యూజర్లు ఈ డేంజర్ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నా.. ఇన్‌స్టాల్‌ చేసుకున్నా.. కనిపించని ఐకాన్‌ స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేస్తుంది. ఆ వెంటనే బ్యాంక్ యాప్ లోని మీ సమాచారం అంతా కూడా హ్యాకర్స్ కు చేరిపోతుంది. ఆయా బ్యాంకుల పేరుతో వస్తున్న ఈ వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy