చెక్ ఇట్ : జియో ప్లాన్స్ ఫుల్ లిస్ట్ ఇదే!

jioజియో కొత్త టారిఫ్ లు ప్రకటించింది. ఛార్జీల మోత మోగించింది. ఫ్లాన్స్ ఛేంజ్ చేసింది. దీపావళి నుంచి మారిన జియో ఛార్ట్ లిస్ట్ ఎలా ఉంది.. ఏయే ఫ్లాన్ ఉంది.. చేర్పులు – మార్పుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రీ పెయిడ్ కస్టమర్ల కోసం :

… రూ.19 ప్లాన్. ఒక రోజు వ్యాలిడిటీ. 150 MB డేటా వస్తుంది. రోజంతా ఫ్రీ కాల్స్. 100 SMSలు ఉచితం

… రూ.52 ప్లాన్. 7 రోజుల వ్యాలిడిటీ. రోజుకు 150MB డేటా. మొత్తంగా 1.05GB డేటా వస్తుంది. కాల్స్ ఉచితం. 70 SMSలు ఫ్రీ. జియో యాప్ ద్వారా సర్వీసులు పొందవచ్చు.

… రూ.98 ప్లాన్. 14 రోజుల వ్యాలిడిటీ. 2.0 GB డేటా. రోజుకు 150MB డేటా వాడుకోవచ్చు. కాల్స్ ఫ్రీ. కంపెనీ యాప్స్ లో ఉచితంగా రిజిస్ట్రర్ అవ్వొచ్చు. SMS ఫ్రీ. టెక్ట్స్ మాత్రం 140 అక్షరాలకు మించరాదు.

… రూ.149 ప్లాన్. 28 రోజుల వ్యాలిడిటీ. 4.2GB డేటా ఇస్తోంది. రోజుకు 150MB మాత్రమే ఉపయోగించుకోవాలి. రోజుకు 100 SMSలు ఉచితం.

… రూ.309 ప్లాన్. జియో మై యాప్ ద్వారానే దీన్ని రీఛార్జ్ చేసుకోవాలి. రోజుకు 1GB డేటా. వ్యాలిడిటీ 49 రోజులు. గతంలో 56 రోజులుగా ఉండేది.

… రూ.399 ప్లాన్. 70 రోజుల వ్యాలిడిటీ. రోజుకు 1GB డేటా. ఉచిత కాల్స్. SMSలు ఫ్రీ. గతంలో ఈ ఫ్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.

… రూ.459 ప్లాన్. ఇది కొత్తగా తీసుకొచ్చింది. వ్యాలిడిటీ 84 రోజులు. మిగతావన్నీ కూడా 399 ఫ్లాన్ లో ఉన్నవే.

… రూ.509 ప్లాన్. రోజుకు 2GB డేటా. 49 రోజుల వ్యాలిడిటీ. మొత్తం 98 GB డేటా వస్తుంది. ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ SMSలు. జియో యాప్ సబ్ స్క్రిప్షన్.

… రూ.799 ప్లాన్. ఈ ప్యాకేజీ కేవలం I phone 8, 8plus కొనుగోలు చేసేవారికి మాత్రమే. రోజు 3GB డేటా. 28 రోజుల వ్యాలిడిటీ. మై జియో యాప్ ద్వారా కనెక్ట్ అయిన వారికి మాత్రమే ఈ ఫ్లాన్ కనిపిస్తోంది.

… రూ.999 ప్లాన్. 90 రోజుల వ్యాలిడిటీ. 60 GB డేటా. రోజుకి ఇంతే వాడాలనే కండీషన్ ఏమీ లేదు. 90లో ఎంతైనా వాడుకోవచ్చు.

… రూ.1,999 ప్లాన్. 180 రోజుల వ్యాలిడిటీ. 125 GB డేటా. కాల్స్, మెసేజ్ లు ఉచితం.

… రూ.4,999 ప్లాన్. ఏడాది పాటు వ్యాలిడిటీ. 350 GB డేటా. రోజువారీ లిమిట్ లేదు. రోమింగ్ కూడా ఉచితం. రోజుకు 100 SMSలు ఉచితం.

… రూ.9,999 ప్లాన్. 360 రోజుల వ్యాలిడిటీ. 750 GB డేటా. రోజువారీ లిమిట్ లేదు. మిగతావన్నీ ఉచితం. ఇవన్నీ కూడా ప్రీపెయిడ్ కస్లమర్ల కోసం జియో కొత్తగా చేర్పులు – మార్పులతో విడుదల చేసిన డేటా ప్లాన్ ఛార్ట్.

జియో పోస్ట్ పెయిడ్ కస్టమర్ల డేటా చార్ట్ ఇలా ఉంది.

… రూ.309 ప్లాన్. రోజుకి 1GB డేటా మాత్రమే. కాల్స్ ఉచితం. SMSలు ఉచితం. సెక్యూరిటీ డిపాజిట్ రూ.400 చెల్లించాలి.

… రూ.409 ప్లాన్. 20 GB డేటా. రోజువారీ లిమిట్ లేదు. 20GB డేటాను నెల మొత్తం వాడుకోవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.500 చెల్లించాలి.

… రూ.509 ప్లాన్. రోజుకి 2GB డేటా వస్తుంది. నెలలో 60GB ఇస్తారు. అన్ లిమిటెడ్ కాల్స్, SMSలు ఉచితం. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.600 చెల్లించాలి.

… రూ.799 ప్లాన్. 90GB డేటా వస్తుంది. రోజుకి 3GB వాడుకోవచ్చు. ఇది iphone 8, 8plus కొనుగోలు చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంది.

… రూ.999 ప్లాన్.  60GB డేటా. రోజువారీ లిమిట్ లేదు. కాల్స్ ఫ్రీ. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1150 చెల్లించాలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy