చెట్టు కింద అక్షర యజ్ఞం చేస్తున్న మన కవులు

Screen Shot 2016-01-04 at 9.51.17 AMసాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ రచయితల వేధిక వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ప్రకృతి మాతగా వర్ధిల్లుతున్న చెట్టును వేదికగా చేసుకొని చెట్టుకింద అక్షరం పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. సంఘ సంస్కర్త మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని లాంఛ్ చేశారు.

ఎందరికో జ్ఞానోదయం కలిగించిన చెట్టు.. ప్రగతిశీల భావాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు కవులు, రచయితలు. ‘చెట్టు కింద అక్షరం’ పేరుతో తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓయూలోని ఓ చెట్టుకింద సమావేశమైన రచయితలు.. సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేసే అంశాలపై చర్చించారు. స్వార్థం వీడి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు ప్రజాకవి గద్దర్. చెట్లు చెడుగాలిని పీల్చుకుని.. ప్రాణవాయువునిస్తుంటే, మనిషి మాత్రం నిలువెల్లా స్వార్ధంతో నిండిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై కొరడా జుళిపించడమే సరైన విధానమన్నారు కవులు, రచయితలు. శ్రమజీవులపై పెద్దరికం చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

Screen Shot 2016-01-04 at 9.50.49 AM

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy