చెత్తను ఊడ్చేవాళ్లే దేవుళ్లు : సీఎం

11010603_783272671788726_3105664309731538765_nహైదరాబాద్ లో సరైన సదుపాయాలు లేకపోవడం బాధాకరమని సీఎం కేసీఆర్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తర్వాత స్వచ్ఛ్ హైదరాబాద్ లోగో, సీడీని గవర్నర్, సీఎం ఆవిష్కరించారు. స్వచ్ఛ్ తెలంగాణ స్వచ్ఛ్ హైదరాబాద్ ఫేస్ బుక్ పేజీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన సీఎం.. సఫాయి కార్మికులకు సెల్యూట్ చేయాలని, చెత్తను ఊడ్చేవాళ్లే దేవుళ్లని సీఎం అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి టైమ్ బాండ్ లేదని.. రేపటి నుంచి పూర్తి స్థాయిలో స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఎవరిపై ఎలాంటి ఆంక్షలు లేవని, ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ నుంచి స్వచ్ఛ్ హైదరాబాద్ కోసం రూ. 75 కోట్లు మంజూరు అయ్యేలా చేసిన కేంద్ర మంత్రి దత్తాత్రేయకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు.

ఇంకా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనటం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ బాధ్యతగా తీసుకోవాలని, రాజకీయాలకు అతీతంగా దీన్ని జరపాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి హైదరాబాద్ క్లీన్ సిటీగా మారాలన్నారు.

స్వచ్ఛ్ హైదరాబాద్ సీఎం స్వయంగా డిజైన్ చేసిన అద్భుతమైన కార్యక్రమమని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్ నినాదం కాదు.. అదొక విధానమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టిన సీఎం కేసీఆర్ కు ఆయన అభినందనలు చెప్పారు. ప్రభుత్వ పథకాలు సక్సెస్ కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ దేశంలోనే గొప్ప నగరమని.. దేశంలోనే మోడల్ సిటీగా హైదరాబాద్ తయారు కావాలన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy