చెన్నై తీరానికి INS  యుద్ధ నౌక

ins గైడెడ్ మిస్సైల్  విధ్వంసక  పీ15ఏ యుద్ధ నౌక INS చెన్నై శనివారం చెన్నై తీరానికి చేరుకుంది. వెస్టర్న్ ప్లీట్ లో భాగంగా ఈ నౌకను గతేడాది భారత నేవీలోకి ప్రవేశపెట్టారు. తొలి పర్యటనలో ఈ నౌక మెరీనా బీచ్ లో గంగర్ వేయగా…స్కూల్ విద్యార్థులు జాతీయ పతాకాలతో ఘన స్వాగతం పలికారు. పోర్టు ట్రస్టులో విద్యార్థుల సందర్శనకు అనుమతించారు. మెరీనా బీచ్ లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు విద్యుద్దీపాలతో కాంతులీనుతున్న ఈ షిప్ ను సందర్శకులు వీక్షించారు. 163 మీటర్ల పొడవున్న INS చెన్నై ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. షిప్ లోని లాంచర్, టార్పెడో ట్యూబ్ లాంచర్,ఆటోమోటెడ్ పవర్ మేనేజ్ మెంట్ సిస్టం, సోనార్ పరికరాలు దేశీయంగా తయారైనవే. ఈ నౌక ముంబైలో నిర్మాణంలో ఉన్నప్పుడే చెన్నై లో వరద నివారణ చర్యలకు అవసరమైన సహాయక వస్తువులను నగరానికి తరలించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy