చెన్నై మృతులకు పరిహారం ప్రకటించిన ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు..

చెన్నైలో బిల్డింగ్ కూలిన ఘటనలో ఇప్పటి వరకూ 11 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో చనిపోయిన వారికి ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. మృతులకు రూ.2లక్షల చొప్పున పరిహారం..గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి  మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని కూడా ఆదేశాలు అందించింది.

ఏపీ ప్రభుత్వం కూడా చెన్నై బిల్డింగ్ కూలిన ఘటనలో చనిపోయిన వారికి పరిహారం ప్రకటించింది. ఘటనలో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారు ఉండటంతో వెంటనే చెన్నైకు వెళ్లాలని ఏపీ మంత్రి మృణాళినికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని  నిర్ణయానికి వచ్చారు. ఘటనలో గాయపడిన ఏపీకి చెందిన బాధితుల సహాయక చర్యలను పర్యవేక్షించాలని నెల్లూరు కలెక్టర్ కు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy