చెల్లెలు పై గెలిచిన అక్క

SERENAఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో వీనస్ విలియమ్స్  తన చెల్లెలు సెరీనా విలియమ్స్‌పై గెలిచింది.  ఉమెన్స్  సింగిల్స్ లో భాగంగా మూడో రౌండ్ పోరులో వీనస్ 6-3, 6-4 స్కోరుతో సెరీనాపై వరుస సెట్లలో గెలిచింది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన సెరీనా.. తిరిగి టెన్నిస్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది. సెరీనా ఈ మ్యాచ్‌లో 41 తప్పిదాలు చేసింది. సుమారు గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో వీనస్… సెరీనా చేసిన తప్పులను విజయానికి అనుకూలంగా మలచుకుంది.

సెరీనా, వీనస్ ల మధ్య ఇప్పటివరకూ జరిగిన 28 మ్యాచ్‌ల్లో సెరీనా 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, వీనస్‌ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందారు. 1998 ఆస్ట్రేలియా ఓపెన్‌లో వీరిద్దరూ తొలిసారి తలపడగా..  2014 తర్వాత సెరీనాపై వీనస్‌ విజయాన్ని సాధించడం ఇదే మొదటి సారి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy