చేపను కోసినట్టే మనిషిని కూడా..

miyazaki_fishఈ పక్కనున్నది ఫొటోగ్రఫీ మ్యాజిక్ కు మచ్చు తునక. కళాభిమానం ఉండాలి కానీ.. వినూత్న ప్రయోగాలు ఎన్నైనా చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఈ ఫొటో సృష్టికర్త జపాన్ యువతి ఇజుమి మియాజకి. చిన్ననాటి నుంచి ఉన్న అభిరుచిని.. అద్భుత కళాసృష్టి దిశగా తీసుకువెళుతోంది ఇజుమి. ఈ ఫొటో ద్వారా మరణం గురించి చెప్పాలనుకున్నానని అంటోంది. ‘అంటిల్ ఐ బికమ్ యాన్ ఆబ్జెక్ట్’ పేరుతో  ఈ ప్రాజెక్ట్ చేసింది. చేపను మధ్యగా కోసి … తన ఆహారాన్ని తీర్చుకుంటాడు మనిషి.. మరి అదే మనిషి మరొకరికి ఆహారమైతే.. ఇదే దీని అర్థమంటోంది ఇజుమి. టోక్యోలోని ముసాసినో ఆర్ట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాపొందిన ఇజుమి… వాస్తవికతను తన ఫొటోలలో చూపించాలని తాపత్రయపడుతుంటుంది. దానికోసం ఎంతైన శ్రమిస్తుంటుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy